జీజీహెచ్లో ఘనంగా అంతర్జతీయ మహిళా దినోత్సవం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అంతర్ జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో ఘనముగా నిర్వహించడం జరిగింది.ఈ వేడుకలికి ముఖ్య అతిథులుగా సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గెస్ట్ ఆఫ్ హానర్ గా డిప్యూటీ కలెక్టర్ సింధు సుబ్రమణ్యం, స్పెషల్ చీఫ్ గెస్ట్ గా రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెండెంట్ గంగా రత్నమ్మ, ప్రతేక అతిథులుగా గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రి బాయి, గ్రేడ్ -2 నర్సింగ్ సూపరింటెండెంట్ విమలమ్మ, గ్రేడ్ -2 నర్సింగ్ సూపరింటెండెంట్ రాజ్య లక్ష్మి, గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మంజుల రాణి, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ వినోదిని హాజరు అయ్యారు. ఈ వేడుకల్లో క్రీడలో గెలుపొందిన హెడ్ నర్సులకి, స్టాఫ్ నర్సులకి బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో నర్సింగ్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షురాలు లీలావతి, సెక్రటరీ బంగారి, వైస్ ప్రసిడెంట్ శాంతి, ట్రెజర్ లక్మి నరసమ్మ, ఈసీ మెంబర్లు శాంతి లత, సోమేశ్వరి, ఉమారాణి , హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.
