PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను ముగ్ధ 2024 అను శీర్షికతో నిర్వహించారు. గత దశాబ్ద కాలంగా ముగ్ధ అను శీర్షికతో అలాగే జీ.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో నారీ ఉత్సవ్ అన్న శీర్షికన విజయవంతంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం పట్ల కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తమ హర్షం వ్యక్తం చేసారు. మహిళా దినోత్సవ సంబరాల చివరి రోజును వివిధ రంగాలకు చెందిన మహిళల సమక్షంలో నిర్వహించారు. యూనివర్సిటీ రిలేషన్స్ ఈపామ్ సిస్టమ్స్ సీనియర్ టాలెంట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ శ్రీ కాజల్ తివారి గారు మరియు రవీంద్ర సంస్థల సీ ఈ ఓ డా. జె. మమతా మోహన్ గారు  మరియు డాక్టర్ ఆర్ శ్రావ్య గైనకాలజిస్ట్ సి ఎన్ హాస్పిటల్స్ముఖ్య అతిధులుగా విచ్చేసారు.ముఖ్య అతిధులు తమ ప్రసంగంలో విద్యార్థిలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నత మైన విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు నేటి మహిళలు తమ తల్లితండ్రులను గౌరవించడం మొదలుకుని తమ జీవిత లక్షాలను అందుకోవడానికి స్థిరమైన వ్యక్తిత్వాన్ని పెపొందించుకోవాలని తమ సందేశాన్ని అందించారు. అలాగే మహిళలు సమాజంలో నేడు జరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకొని ఎల్లప్పుడు జాగరూకులై ఉండాలని తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కల, సాంస్కృతిక మరియు క్రీడా రంగాలకు సంబందించిన వివిధ పోటీలను నిర్వహించారు. కలశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతి ప్రధానం చేసారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డా. కే.ఈ.శ్రీనివాస మూర్తి  డా. సి శ్రీనివాసరావు గారు, డీన్స్, విభాగాధిపతులు, ముగ్ధ కన్వీనర్ డా. యం జయ లక్ష్మి, కో- కన్వీనర్స్ డా.ఎస్. అనురాధ, శ్రీమతి జి. స్పందన, నారీ ఉత్సవ్ కన్వీనర్ డా.బి.సునీత, కో-కన్వీనర్ లక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో మహిళల ప్రాధాన్యతను గుర్తించే ఇటువంటి కార్యక్రమాలను కళాశాలలో నిర్వహించడం పట్ల కళాశాల చైర్మన్ శ్రీ జి.వి. ఎం. మోహన్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేసారు.

About Author