సెయింట్ థెరిసా మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
1 min read
లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది
సోషల్ సైన్సెస్ విశ్రాంత విభాగాధిపతి డి.బ్రహ్మేశ్వరి
మహిళా ససక్తీకరణ, వ్యవహారిక అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా ఉండాలి
సెట్ వెల్ సీఈవో ప్రభాకర్
2025-ఉత్తమ మహిళా,ఉత్తమ విద్యావేత్త,ఉత్తమ విద్యార్థులకు సన్మానం
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025′ లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ చర్యను వేగవంతం చేయండి అనే ప్రచారం స్వీకరించిందని తెలియజేశారు. డి బ్రహ్మేశ్వరి. స్థానిక సెయింట్ థెరిసా మహిళా స్వయంప్రతి కళాశాల మరియు జిల్లా యువజన సర్వీసుల శాఖ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య వక్తగా కళాశాల సోషల్ సైన్సెస్ విశ్రాంత విభాగాధిపతి డి బ్రహ్మేశ్వరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యతను, మహిళలు మరియు బాలికలకు హక్కులు సమానత్వం సాధికారత మొదలైన విషయాలను ప్రస్తావించారు. మహిళల పురోగతికి సహాయం చేసే వ్యూహాలు, వనరులు , చొరవలను గుర్తించి వాటిని విస్తృతంగా వేగంగా అమలు చేయాలని ఉద్దేశాన్ని ఈ సంవత్సరం తెలియజేస్తుందన్నారు.విద్యార్థులలో పత్రికా రచన మరియు వార్తా రచన పై ఆసక్తిని పెంపొందించడానికి ఒక వేదికగా కళాశాల వార్తా చానల్ ను ప్రారంభించడం జరిగింది. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళ 2025, ఉత్తమ విద్యావేత్త 2025, మరియు ఉత్తమ విద్యార్థులను సన్మానించారు. యువజన సర్వీసుల శాఖ సీఈవో ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సశక్తీకరణ, మరియు వ్యావహారక అభివృద్ధిని ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలను గురించి ప్రస్తావించారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్దికై కృషి చేస్తున్న కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యతోపాటుగా ఇతర కార్యక్రమాలు మరియు నాయకత్వ పాత్రలలో అగ్రస్థానంలో ఉన్న విద్యార్థినులను సన్మానించారు. వారి కృషి పట్టుదల మరియు సాధనను అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సి మాట్లాడుతూ లింగ సమానత్వం యొక్క ఐఐఐఐఐఐ మరియు అన్ని రంగాలలో మహిళలను శక్తివంతం చేయడంలో సార్వజనిక బాధ్యతను గురించి గుర్తు చేశారు.విద్యార్థులు ప్రదర్శించిన ద్రౌపది సాగా నృత్య రూపకం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాశాల విమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ పద్మావతి, సెక్రెటరీ రాణి మరియు ఇతర సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మరియ క్రిస్టియ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు.
