రవీంద్ర విద్యాసంస్థల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల, జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ,రవీంద్ర డిగ్రీ కళాశాల ,రవీంద్ర పాఠశాలల్లో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు .రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ముగ్ధ 2K25 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి.నవ్య IAS గారు,జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సి.సరళాదేవి పూర్వవిద్యార్థులు కె.వి.దీప్తి.(సొల్యూషన్ ఆర్కిటెక్.ఎరిక్సెన్ కంపెనీ) కె మల్లిక (సైబర్ సెక్యూరిటి టీమ్ లీడర్) విచ్చేశారు .ఈ సందర్భంగా వీరు అధ్యాపకులతో మరియు విద్యార్థులతో మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు 33% రిజర్వేషన్లు అమలుపరిచి అన్ని విధాలుగా మహిళలకు ప్రోత్సాహమందిస్తున్నారన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని మహిళలందరూ కూడా గొప్ప చదువులు చదివి ,ఉన్నత ఉద్యోగాలను పొంది ,పేదల జీవితాలలో వెలుగులు పెంచాలన్నారు. ఒక మహిళ గొప్పగా చదువుకుంటే రెండు కుటుంబాలు అంటే పుట్టింటి వారు, మెట్టింటి వారు ఆ ఫలాలను అనుభవిస్తాయన్నారు. మన లక్ష్యం గొప్పగా ఉండాలి. ప్రజాసేవ చేయడం అంటే ఒక గొప్ప స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ ఐఎఫ్ఎస్, గ్రూప్ వన్ ఉద్యోగాల వంటివి మనము సాధిస్తే నిజంగా పేద వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపగలుగుతూ సమానత్వాన్ని సాధించగలమన్నారు. అనంతరం రవీంద్ర విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జి. మమతా మోహన్ మాట్లాడుతూ ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సమస్త దేవతలు ఆనందిస్తారన్నారు. మహిళా శక్తి అసామాన్యమైనదని గుర్తు చేశారు. కష్టాలకు కుంగిపోకుండా ,సంతోషాలకు పొంగిపోకుండా దృఢ చిత్తముతో సమస్యలను ఎదుర్కొని మన శక్తి ఏమిటో నిరూపించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఈ శ్రీనివాసమూర్తి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషారాణి ,వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అబ్బాస్ నగర్ లోని రవీంద్రా పాఠశాలల లో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి రవీంద్ర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి, విజయం సాధించిన ఉపాధ్యాయులకు రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య ,రవీంద్ర విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జి. మమతా మోహన్ గారు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది.
