‘శంకరాస్’లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ : శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కళాశాల అడ్వైజర్ వసంతకుమారి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సాంస్కతిక, రాజకీయ, సామాజిక ఆర్థిక విజయాల జ్ఞాపకార్థమని తెలిపారు. లింగ సమానత్వం, మహిళల హక్కులు, మహిళలపై హింస వంటి సమస్యలపై దష్టి సారిస్తూ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపు కుంటు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి హరికిషన్ గారు మాట్లాడుతూ ఒక మహిళ మరొక మహిళ అభివృద్ధికి సహకరించాలని, రెండు ,మూడు పనులను ఏకకాలంలో చేస్తూ కుటుంబము, ఉద్యోగానికి మహిళ న్యాయం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల మహిళా అధ్యాపకులు హేమ,సుమలత,మాధవి,అశ్శరఫ్ , హిమబిందు, సవిత,మౌనిక, పద్మ మరియు ఇతర అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.