NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్సాహంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపారు. ఈ కార్యక్రమాన్ని వుమెన్స్ సెల్ మరియు IEEE WIEAG సమన్వయంతో నిర్వహించారు. మహిళల ప్రగతికి, సాధనలకు, మరియు సామాజిక అభివృద్ధిలో వారి పాత్రకు గౌరవ సూచకంగా ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థులచే నాటికలు ప్రదర్శించబడ్డాయి. వీటిలో మహిళా దినోత్సవ ఆవిర్భావ చరిత్ర, అలాగే రాణి లక్ష్మీ బాయి, సావిత్రిబాయి ఫూలే వంటి ప్రముఖ భారతీయ మహిళల జీవిత కథలు ప్రదర్శించబడ్డాయి. వీటి ద్వారా మహిళల సాధనను గుర్తు చేస్తూ, సమాజంలో మహిళా సాధికారితకు ప్రాధాన్యతను తెలియజేశారు.ఈ సందర్భంలో  డీన్ స్టూడెంట్ అఫైర్స్ డా. కె. దేవకీ దేవి “ఆత్మనిర్భరత మరియు సహన శక్తి” అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమం చివర్లో సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

About Author