డిఎస్పీ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర మద్యం బాటిళ్ళు ధ్వంసం
1 min read– దాదాపు రూ.లక్ష విలువైన అంతరాష్ట్ర మద్యం బాటిళ్ళు ధ్వంసం చేసిన పోలీసులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడేళ్ళుగా వివిధ కేసుల్లో పట్టుబడిన అంతరాష్ట్ర మద్యం బాటిళ్ళను , నాటు సారా ను ఆత్మకూరు డి ఎస్ పి వై శృతి ఆధ్వర్యంలో పట్టణ సి ఐ విజయ భాస్కర్ , ఎస్ఐ ఎన్వి రమణ లు ఎస్కవేటర్ సహాయంతో బుధవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరాష్ట్ర మద్యం, ఎక్షైజ్ పరిధిలో 49 ఉన్నాయని ఇందులో 13 ఎక్షైజ్, 36 సారా కేసులు ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ.1 లక్ష విలువైన అంతరాష్ట్ర మద్యం బాటిళ్ళను, 150 లీటర్ల నాటు సారా బాటిళ్ళు, బిందెలు, ప్యాకెట్లను పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆత్మకూరు డిఎస్పీ వై శృతి పర్యవేక్షణ లో అర్బన్ సిఐ విజయ భాస్కర్ , ఎస్ ఐ ఎన్ వి రమణ లు ధ్వంసం చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.