NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోనిలో ‘అంగన్​వాడీ వర్కర్స్​ & హెల్పర్స్ ’​ అభ్యర్థులకు ఇంటర్వ్యూ

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని డివిజన్​ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్​వాడీ వర్కర్స్​ మరియు హెల్పర్స్​ పోస్టులకు సంబంధించి బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. అర్హత వివరాలు తదితర అంశాలపై ఆర్డీవో జి. రామకృష్ణ రెడ్డి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రణీత, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ రఘురాం రెడ్డి అభ్యర్థులను ప్రశ్నించారు. కోవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఇంటర్వ్యూ నిర్వహించారు.

14 అంగన్​వాడీ వర్కర్స్​ పోస్టులకుగాను 22 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. అలాగే 102 అంగన్​వాడీ హెల్పర్స్​కుగాను 237 మంది హాజరు కాగా 51 మంది గైర్హాజరయ్యారు. అంగన్వాడి వర్కర్స్ మరియు అంగన్వాడి హెల్పర్స్ మొత్తం 116 గాను 311 అప్లై చేసుకోగా ఇంటర్వ్యూ 259 మంది హాజరయ్యారు. 52 గైర్హాజరు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆదోని సి.డి.పి.వో (అర్బన్) సఫర్ నిషా బేగం, ఎమ్మిగనూరు సిడిపిఓ నాగమణి, పత్తికొండ సిడిపిఓ మద్దమ్మ, ఆలూరు సి డి పి ఓ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.


About Author