NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

19 నుంచి 22 వరకు అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

1 min read

– ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేని అభ్యర్థులను మౌఖిక పరీక్షకు అనుమతించబడదు

– ఐసిడిఎస్ పిడి ధనలక్ష్మి

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:  ఈ నెల 19 నుంచి 22 తేదీ వరకు అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ పిడి ధనలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ….అన్నమయ్య జిల్లాలోని ఐసీడీఎస్‌ వివిధ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్ వాడీ కార్యకర్తలు 14, సహాయకురాలు 53, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు13 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులకు రెవిన్యూ డివిజన్ల వారిగా దిగువ తెలిపిన తేదీలల్లో మరియు సమయాల్లో మౌఖిక పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అంగన్ వాడీ పోస్టులకు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. అలాగే రాజంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అంగన్ వాడీ పోస్టులకు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. అదే విధంగా రాయచోటి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అంగన్ వాడీ పోస్టులకు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు రాయచోటి ఆర్ డిఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ధరఖాస్తు చేసుకొని అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వారి యొక్క రెవిన్యూ డివిజన్ కు కేటాయించిన తేదీలలో సూచించిన సమయమునకు, కేటాయించిన ప్రదేశమునకు మౌఖిక పరీక్షకు వారి యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని హాజరు కావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేని అభ్యర్థులనుపరీక్షకు అనుమతించబడదన్నారు.

About Author