ఉపాధ్యాయులు,తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశ వేడుకలు
1 min read
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు అద్భుత ఫలితాలను ఇస్తుంది
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
నెక్స్ట్ జెన్ సంస్థ సహకారంతో ఆరో ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కని విని ఎరుగని రీతిలో నేడు విద్యావ్యవస్థ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటుందనీ, ఎలాంటి పిచ్చి బొమ్మలు లేకుండా విద్యార్థులకు మహనీయుల పేర్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారిలో సామాజిక స్పృహను మరింత పెంపొందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ద్వారా పిల్లలకు సన్న బియ్యం అందిస్తూ వారికి పాఠశాలలో అందించే భోజనం పట్ల మరింత ఇష్టం పెరిగేలా చేయడం జరిగిందని ఈ పథకం అద్భుత ఫలితాలు ఇస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు,సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా వారికి మెరుగైన విద్యను అందించే ప్రయత్నంలో సహకరించడం జరిగిందని రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేస్తామని దీని ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని” దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు.ఏలూరు రూరల్ మండలం చాటపర్రు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మీయ స్వాగతం పలికిన విద్యార్థులు , పాఠశాల సిబ్బంది – విద్యార్థుల కోరిన మౌలిక సదుపాయాల కల్పనపై స్పందిస్తూ పాఠశాల ప్రహరీ గోడ నూతనంగా నిర్మించడం, పాఠశాల ప్లే గ్రౌండ్ విస్తీర్ణ అంశం, అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, సైకిల్ షెడ్యూల్ నిర్మాణం చేయాలంటూ సభా వేదిక నుంచే ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే స్పందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కరతాల ధ్వనులతో ఉప్పొంగిన ఉత్సాహంతో అభినందనలు విద్యార్థులు తల్లిదండ్రులు తెలియజేశారు. విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది.ఈ సందర్భంగా పాఠశాలలో నెక్స్ట్ జెన్ సంస్థ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి విజయరాజు, ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, కుటమి నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
