NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్ లోకి .. వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వర‌లోనే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విష‌యం పై ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చలు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. వారిలో కొంద‌రు ప్రశాంత్ కిషోర్ చేరిక‌పై అభ్యంత‌రం తెలిపిన‌ట్టు స‌మాచారం. వీరిలో పార్టీ వైఖ‌రిని నిర‌సిస్తూ గ‌తేడాది లేఖ రాసిన 28 మంది కూడ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ప‌లువురు నేత‌లు మాత్రం ప్రశాంత్ కిషోర్ చేరిక పార్టీకి లాభం చేకూరుస్తుంద‌ని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నిక‌ల వ్యూహాలు, విజ‌యాలు చూసిన కాంగ్రెస్ నేత‌లు.. మోదీ ప్రతిష్ట మ‌స‌క‌బారుతున్న సంద‌ర్భంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహ‌క‌ర్త సేవ‌లు పార్టీకి అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు.

About Author