అటవీ శాఖ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు రామనపల్లి గ్రామ సచివాలయం సిబ్బందికి రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి , ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన క్యాలెండర్లు,, అదేవిధంగా డైరీలను ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామన శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అన్నారు, అలాగే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యం అని భావించి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా చూడడం జరిగింది అన్నారు, అంతేకాకుండా దీంతో లక్షలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడం జరిగిందన్నారు… కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి శకుంతలమ్మ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.