PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పల్లెవెలుగు’ క్యాలెండర్​ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు, కర్నూలు:గ్రామీణ, పట్టణ ప్రజల సమస్యలను  ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి… పరిష్కరించే దిశగా వార్తలు రాయడంలో పల్లెవెలుగు దినపత్రిక ముందుంటుందన్నారు హౌసింగ్​ డెవలప్​మెంట్​ మేనేజర్​ (హెచ్​డీఎఫ్ సీ​) పూజల హరిరాఘవేంద్ర. గురువారం పల్లెవెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్​ను సిబ్బందితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి. హరి రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రజలకు..ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పని చేయాలని కోరారు. సమాజంలో అవినీతి  రూపుమాపడంలో మీడియాపాత్ర కీలకమన్నారు.  మారుతున్న కాలానుగుణంగా పల్లెవెలుగు దినపత్రిక డిజిటల్​ మీడియా (వెబ్​ మీడియా) వైపు అడుగులు వేయడం అభినందనీయమన్నారు. సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి… పల్లెవెలుగు డిజిటల్​ మీడియా మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా  హెచ్​డీఎఫ్​సీ హౌసింగ్​ డెవలప్​మెంట్​ మేనేజర్​ పూజల హరిరాఘవేంద్ర ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు సిబ్బంది ఉన్నారు.

About Author