చర్మ, కేశ సౌందర్యానికి ప్రత్యేక ఉత్పత్తుల ఆవిష్కరణ
1 min read– పెప్ ఫ్యాక్టర్‌ను ఆవిష్కరించిన అకాన్ బయో, ఎఫ్‌డీఏ మ్యాప్
– సెంచురీ ఆస్పత్రిలో హాజరైన పలువురు డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : చర్మ, కేశ సౌందర్యానికి ప్రత్యేకంగా రూపొందించిన పెప్‌ఫ్యాక్టర్ ఉత్పత్తులను అకాన్ బయో, ఎఫ్‌డీఏ మ్యాప్ సంస్థలు హైదరాబాద్ వాసులకు పరిచయం చేశాయి. బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆస్పత్రి ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమానికి నగరంలోని పలువురు డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు హాజరయ్యారు. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మధ్య ప్రాచ్యం, ఇతర దేశాల్లో విస్తృతంగా వాడుకలో ఉండి, వేలాదిమందికి చికిత్సలలో ఉపయోగపడిన ఈ ఉత్పత్తులను హైదరాబాద్ వాసులకు పరిచయం చేసేందుకు తీసుకొచ్చినట్లు పెప్ ఫ్యాక్టర్ యూఎస్ సీఈఓ ముకేష్ కుమార్, అమెరికాకు చెందిన సంస్థ ఎగ్జిక్యూటివ్ మార్క్ ఎర్లిచ్ తెలిపారు. ఇప్పుడు నగరంలోని అన్ని ప్రధాన కాస్మెటాలజీ కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇవి అందుబాటులో ఉంటాయన్నారు. దాదాపు దశాబ్దానికి పైగా అమెరికా, ఆస్ట్రేలియాలలో విస్తృతంగా పరిశోధన చేసిన తర్వాత పేటెంటు హక్కులతో రూపొందించిన ఉత్పత్తే పెప్ ఫ్యాక్టర్. దీన్ని అమెరికాలో సిజీఎంపీ కింద అకన్ బయో ఉత్పత్తి చేస్తుండగా, అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏమ్యాప్ సంస్థ భారతదేశంలో ఏబీఐ ప్రైవేట్ లిమిటెడ్ అనే డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మార్కెటింగ్ చేస్తోంది.