పల్లెవెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
1 min read
పల్లెవెలుగు వెబ్ ఖాజీపేట: ఖాజీపేట 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను బీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల (అకౌంట్) అడ్మినిస్ట్రేషన్ అధికారి రవి కుమార్ గురు వారం ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న తెలుగు దినపత్రిక ప్రజలలో ఎంతో ఆదరణ పొందినదని ఆయన అన్నారు, అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళిక గురించి అనేక వ్యాసాలతో పాటు, సరికొత్త శీర్షికలతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే వార్తలను ప్రచురించడం జరుగుతుందన్నారు, విద్యావ్యవస్థకు ఎంతో దోహదపడుతున్న పల్లె వెలుగు పత్రిక ద్వారా వెలువడిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ కూడా చాలా రంగుల మయంగా అందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.