వైయస్సార్ ఎస్ యు క్యాలెండర్ ఆవిష్కరణ
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వైయస్సార్ ఎస్ యు 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను కమలాపురం శాసనసభ్యులు పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పాటుపడుతూ, సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్న వ్యక్తి గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి అని తెలిపారు, అలాంటి వ్యక్తి మరింత ముందుకెళ్లి విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు పాటుపడతారని ఆయనకు జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు, అప్పటినుంచి ఆయన నిరంతరం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుపై పోరాటం సాగిస్తున్నారని, సాగించడమే కాకుండా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు, భవిష్యత్తులో సాయి కుమార్ రెడ్డి, విద్యార్థుల భవిష్యత్తు కొరకు మరింత ఆయన సేవలు అవసరమని, ఆ దిశగా ఆయన ప్రయత్నం చేస్తారని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రెడ్డి మహేష్, జయరామిరెడ్డి, కల్లూరు శ్రీనివాసులరెడ్డి, మైసూరా రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.