NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇన్వర్టర్, వాటర్ ప్యూరిఫైర్ లు బహుకరణ: యూ.బి.ఐ

1 min read

– దాతల సహకారం అభినందనీయం.. జెడి మల్లికార్జునరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : వసతిగృహంలో విద్యార్ధినులకు సురక్షిత మంచినీరు అందించడానికి మరియు ఇన్వర్టర్ ఏర్పాటు చేయడానికి ఏలూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వారు ముందుకు వచ్చి సదుపాయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ జేడి మధుసూధనరావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం స్ధానిక అమీనాపేటలో సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు బ్రాంచివారు సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా వసతిగృహానికి ఇన్వర్టర్, వాటర్ ప్యూరిఫైర్ ను బహూకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎంజికె మూర్తి , ఛీఫ్ మేనేజర్లు వివి సంజీవరావు, ప్రియదర్శిని, ఎఎఓ నాగార్జునరావు, అమీనాపేట సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతిగృహం సంక్షేమ ఆఫీసర్ జి. రాధ, ఎఎస్ డబ్ల్యూఓ త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.

.

About Author