ఐపీఓల్లో పెట్టుబడి.. నిబంధనలు కఠినం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఐపీఓల్లో పెట్టుబడి నిబంధనలు సెబీ కఠినతరం చేసింది. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తోంది. . ఐపీఓ నిధులతో ఇతర కంపెనీల కొనుగోళ్ల నిబంధనలను మరింత పటిష్టం చేసింది. ఇక నుంచి కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించే నిధుల్లో 25 శాతానికి మించి, ఆఫర్ డాక్యుమెంట్‌లో చెప్పని కంపెనీల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసేందుకు వీలుండదు. కంపెనీల సాధారణ అవసరాల కోసమూ ఐపీఓ నిధుల్లో 10 శాతానికి మించి ఖర్చు చేయకుండా ఆంక్షలు విధించింది. వ్యాపార విస్తరణ పేరుతో కంపెనీల అడ్డగోలు కొనుగోళ్లకు చెక్ పెట్టేందుకు సెబీ ఈ చర్య తీసుకుంది.
లాక్ ఇన్ పీరియడ్ పెంపు :
యాంకర్ ఇన్వెస్టర్ల అడ్డగోలు లాభాలకు చెక్ పెట్టేందుకూ సెబీ చర్యలు తీసుకుంది. ఇక నుంచి వీరు తమ పెట్టుబడుల్లో 50 శాతం మాత్రమే నెల రోజుల తర్వాత అమ్ముకునేందుకు అనుమతిస్తారు. మిగతా 50శాతం షేర్లను అమ్ముకునేందుకు 90 రోజుల వరకు వేచిచూడాల్సిందే. ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకిరానుంది.