NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘నా మొత్తం ఆస్తుల మీద విచార‌ణ చేప‌ట్టండి’

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: త‌న చరిత్ర, త‌న మొత్తం ఆస్తుల మీద విచార‌ణ చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ నేత‌, మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. త‌ప్పు చేసిన‌ట్టు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమ‌ని తెలిపారు. ఆస్తులు ప‌ద‌వుల కోసం తాను లొంగ‌న‌ని, ఆత్మగౌర‌వం కంటే ప‌ద‌వులు గొప్పవి కాద‌ని ఆయ‌న అన్నారు. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల మీద ఆయ‌న స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు కావాల‌నే కుట్రపూరితంగా వ్యవ‌హ‌రిస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ‘పౌల్ర్టీ కోసం ఎక్కువ భూమి అవ‌స‌రం. కెన‌రా బ్యాంక్ నుంచి 100 కోట్ల రుణం తీసుకున్నాను. విస్తర‌ణ కోసం ప‌రిశ్రమ‌ల శాఖ‌కు లేఖ రాశాను. ఎక‌రం 6 ల‌క్షల‌తో .. వ్యవ‌సాయ యోగ్యం కాని భూమిని కొన్నాం..’ అని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.

About Author