అగ్ర సెని అక్రమాలపై విచారణ చేయండి..
1 min read– ప్రజా సంఘాలు స్పందనలో ఫిర్యాదు..
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండలం కౌలూరు గ్రామ రెవెన్యూలో బీకే.సింగ్ వారు వేసిన తిరుమలగిరి గ్రీన్ సిటీ వెంచర్ పై విచారణ జరిపించాలి. బీకే సింగ్ వారు వేసిన వెంచర్ అక్రమాలపై విచారణ జరిపించాలని సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) గౌ. పుల్లయ్య వినతిపత్రం అందజేసిన ప్రజాసంఘాల ప్రతినిధులు .పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో నూతనంగా బీకే.సింగ్ ఏర్పాటు చేసిన తిరుమలగిరి గ్రీన్ సిటీ వెంచర్ పై జిల్లా స్ధాయి ప్రత్యేక అధికారితో విచారణ జరిపించి , ఆ వెంచర్లో బీకే సింగ్ వారు అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను బహిర్గతం చేయాలని , ప్రభుత్వ భూములను సొంత ఆస్తులుగా ఆక్రమించుకుంటున్న తిరుమలగిరి వెంచర్ల అధినేత బీకే.సింగ్ వెంచర్లపై సమగ్ర విచారణ జరిపి , బీకే సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాడు నంద్యాల జిల్లా కలెక్టరేట్ కారాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పుల్లయ్య గారికి ప్రజా సంఘాల నేతలు రామినేని రాజునాయుడు , పెరుగు శివకృష్ణ యాదవ్ , దేవదత్తు , వనం వెంకటాద్రి , చల్లా సురేష్ బాబు , బాలకృష్ణ నాయక్ తదితరులు వినతిపత్రాన్ని అందజేసి సమష్యను వివరించారు.ఈ సందర్బంగా ప్రజా సంఘాల నేతలు రామినేని రాజునాయుడు , పెరుగు శివకృష్ణ యాదవ్ , దేవదత్తు , వనం వెంకటాద్రి , చల్లా సురేష్ బాబు , బాలకృష్ణ నాయక్ తదితరులు మాట్లాడుతూ…నంద్యాల జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామ రెవెన్యూలో అగ్రసేని రియల్ ఎస్టేట్ సంస్థ వారు తిరుమలగిరి గ్రీన్ సిటీ పేరుతో వెంచర్ వేయడం జరిగిందనీ, అయితే ఈ వెంచర్లో వాగు , కాల్వ మరియు ప్రభుత్వ భూములను 4 ఎకరాల వరకు ఆక్రమించారు సంబంధిత సర్వే నెంబర్లు
1) సర్వే నెం: 400 జుర్రాగు సంబంధించిన భూమి.
2) సర్వే నెం: 418/C ప్రభుత్వ భూమి అని
3) సర్వే నెం: 423 కాల్వ భూమి ఇవి కాక ఇంకా ఇతర ప్రభుత్వ భూమి కూడా ఆక్రమించారన్నారు.
ఇందుకు పాణ్యం మండలం కౌలూరు వీఆర్ఓ గారు, పాణ్యం మండలం సర్వేయర్ గారు, ఇరిగేషన్ వారు, వెంచర్ అప్రూవల్ ఇచ్చిన కుడా వారు, సహకరించారని తెలియపరుస్తున్నామన్నారు. అడంగల్ రికార్డులో అతనికి హక్కుగా 45.44 ఎకరాలు మాత్రమే హక్కుగా ఉంటే వారి వెంచర్ ప్లాన్ లో 49 ఎకరాలకు పైగా ప్లాన్ చూపించడం జరిగిందన్నారు.వారి హక్కు భూమి కాకుండా మిగతా భూమి ఎక్కడిదో తెలియదనీ, సర్వే నెంబర్ 400లో భూమి 14 ఎకరాలకు పైగా ఉంటే అడంగల్ లో అధికారులు 3 ఎకరాల వరకు మాత్రమే చేర్చారు. మిగతా భూమి కనబరచలేదనీ, కావునఈ తిరుమలగిరి గ్రీన్ సిటీ వెంచర్ పై ఉన్నత స్థాయి అధికారులచే స్పెషల్ కమిటీ వేసి విచారణ జరపించాలని వారు డిమాండ్ చేశారు.