PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విచారణ వేగంగా జరగాలి.. రికవరీ త్వరగా చేయాలి..

1 min read

–డీఎల్​ఆర్​సీ మీటింగ్​లో అధికారులను ఆదేశించిన చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి సి.వి.సంబ్బారెడ్డి

పల్లెవెలుగు వెబ్​ : వివిధ శాఖల్లో వచ్చిన అవినీతి ఆరోపణలపై  చేపట్టిన సామాజిక తనిఖీపై పూర్తిస్థాయి విచారణ వేగంగా జరగాలని ఆదేశించారు చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి/ చీఫ్ విజిలన్సు అధికారి సి.వి.సంబ్బారెడ్డి. మంగళవారం జిల్లా నీటియాజమాన్య సంస్థ, అనంతపురము కార్యాలయంలో DLRC మీటింగ్ హాల్​లో  సి.వి.సంబ్బారెడ్డి, చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి/ చీఫ్ విజిలన్సు అధికారి గారి అధ్యక్షతన రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి ( అనంతపురము, చిత్తూరు, కడప, కర్నూలు  MGNREGS మరియు అనుబంధ శాఖ ల పనులపై జరిగిన సామాజిక తనిఖిలో వెల్లడైన అభియోగాలపై తీసుకోవలిసిన చర్యల పై అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రాంతీయ సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సమావేశములో అన్ని జిల్లాల- PD-DWMA, PD-DRDA, SE-PR, SE- RWS, DFO(FOREST), సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారులు, PD (HOUSING), JD-Animal Husbandry, Sericulture, వాటర్ షెడ్ అధికారులతో వారి వారి శాఖల పై సామాజిక తనిఖీ మీద జరిగిన ఎంక్వయిరీ, రికవరీ మరియు సామాజిక తనిఖీ బృందం వారికి సమర్పించని రికార్డుల వివరాలు మొదలగు అంశాలపై కుణ్ణంగా సమీక్షించడం జరిగింది.

సామాజిక తనిఖిలో ఆదేశించిన ఎంక్వయిరీలు త్వరితగతిన పూర్తి చేయించవలసినదిగా అధికారులను ఆదేశించడం జరిగింది. సామాజిక తనిఖీ బృందం వారు మండలాలనం సందర్శించినప్పుడు Work files రూపంలో సిద్దపరచి వారికి అందచేసి చేసిన పనవిలనం క్షేత్ర స్థాయిలో తప్పకుండా తనిఖీ చేయించి సామాజిక తనిఖీ బృందం వారికి సహకరించవలెనని ఆదేశించారు. మరియు సామాజిక తనిఖీ పై వచ్చిన అభియోగాలపై సంబంధిత సిబ్బందితో వ్యక్తిగత విచారణ జరిపి, ఫిబ్రవరి 15 వ తేదీ లోపు పూర్తి చేయవలిసినది గా ఆదేశించారు. అలాగే వ్యక్తిగత విచారణలు కూడా ఫిబ్రవరి 28 వ తేదీ లోపు పూర్తి చేయవలిసినదిగా ఆదేశించారు. లేకపోతే సంభందిత జిల్లా శాఖా అధికారులపై చర్యలు తీసఁకోబడునని హెచ్చరించారు. ప్రతి శాఖలోనం ఇదివరకే వ్యక్తిగత విచారణలు జరిపి రికవరీ మొత్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఇంకా రికవరీ చేయని మొత్తాలు చాలా పెద్ద మొత్తంలో పెండింగ్ లో వున్నాయి. వాటిపై సత్వరమే చర్యలు తీసుకొని ఫిబ్రవరి 28 వ తేదీ లోపు పూర్తి చేయవలిసినదిగా ఆదేశించారు.  ఈ ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని శ్రీ వేణు గోపాల్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, అనంతపురము వారు నిర్వహించారు.

About Author