విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : జిల్లా ఎస్పి
1 min read– స్పందన కార్యక్రమానికి 107 ఫిర్యాదులు .
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) కుమారుడు ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నాడని వెల్దుర్తి మండలం, పుల్లగుమ్మి గ్రామానికి చెందిన కె. శేషిరెడ్డి ఫిర్యాదు చేశారు.
2) నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి కొందరు వ్యక్తులు నాకు ప్లాటు అమ్మి మోసం చేశారని కర్నూలు , స్టాంటన్ పురం కు చెందిన విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
3) వేల్ పే ట్రేడింగ్ షేర్ మార్కెటింగ్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెట్టింపు డబ్బులు వస్తాయని కొందరు వ్యక్తులు మమ్మల్ని నమ్మించి డబ్బులు కట్టించి మోసం చేశారని కర్నూలు , సీతరాం నగర్ కు చెందిన నాగజ్యోతి ఫిర్యాదు చేశారు.
4) నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నా భర్త పొలాన్ని నా మరిది అమ్మిస్తానని రిజిష్టర్ చేయించిన తర్వాత ఎక్కువ ధరకు అమ్ముకుని, మాకు మాత్రం తక్కువ ధర కు అమ్మినట్లు డబ్బులు ఇచ్చి మోసం చేశాడని ఓర్వకల్లు మండలం, సోమయాజుల పల్లె గ్రామానికి చెందిన చంద్రిక ఫిర్యాదు చేశారు.
5) కర్నూలు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన వ్యక్తి డబ్బులు తీసుకుని మోసం చేశాడని ప్రకాశం జిల్లా, కోమరవోలు మండలం, ఎర్రపల్లె గ్రామానికి చెందిన వినయ్ కుమార్ ఫిర్యాదు చేశారు.స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి వెంకటాద్రి, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు పాల్గొన్నారు.