పెట్టుబడిదారులు పెరుగుతున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో డీమ్యాట్ ఖాతాలు పది కోట్ల మైలురాయిని దాటాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ , సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ తాజా డేటా ప్రకారం.. ఆగస్టు నెలలో కొత్తగా 22 లక్షలకు పైగా ఖాతాలు తెరిచారు. దాంతో మొత్తం డీమ్యాట్ అకౌంట్లు 10.05 కోట్లకు చేరుకున్నాయి. కరోనా సంక్షోభానికి ముందు (2020 మార్చి నాటికి) దేశంలో 4.09 కోట్ల డీమ్యాట్ ఖాతాలుండేవి. అంటే, గడిచిన రెండేళ్ల ఐదు నెలల్లో దాదాపు 6 కోట్ల కొత్త ఖాతాలు తెరుచుకున్నాయి. కొత్త ఖాతాదారుల్లో మెజారిటీ వర్గం యువతే కావడం గమనార్హం. పెట్టుబడి సాధనంగా ఈక్విటీలు, ఇతర సెక్యూరిటీల సాధనాలకు ఆమోదం పెరుగుతున్నదనడానికి ఇదే నిదర్శనమని మార్కెట్ వర్గాలంటున్నాయి.