రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం పోస్టర్లు విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల:ఈనెల 25 26 27 తేదీలలో జరుగు పిడిఎస్ రాష్ట్ర మహాసభలను ఏలూరులో నిర్వహించడం జరుగుతుందని ఈ సభలను విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం పోస్టర్లను స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు P. శ్రీనివాసులు ఆవిష్కరించారు పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆది మాట్లాడుతూ భారతదేశంలో విద్యారంగ ప్రపంచీకరణ తదనంతరం మార్కెట్లో అంగడి సరుకుగా మారిపోయిందన్నారు ప్రభుత్వ రంగం స్థానంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఆదిపత్యం పెరిగి ఎనిమిదేళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో విద్యారంగం తిరోగమనం వైపు ప్రయాణం చేస్తుందని కార్పొరేట్లు బడా సంపన్నులుగా మారారని ఆరోపించారు కారుచౌకగా ప్రభుత్వాస్తులను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నాడని 75 సంవత్సరాల లో ఎన్నడు లేని విధంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు పెరిగి నిరుద్యోగం పేదరికం ఆకలి చావులు పేదలు మరింత పెరిగాయని దేశంలో 75 శాతం సంపద 1 శాతం కార్పొరేట్ల సంపదకు సమానంగా చేరిందన్నారు నూతన విద్యా విధానంతో విద్యారంగంలో మనువాద కాషాయ సాంస్కృతిని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఒకే జాతి ఒకే మతం ఒకే ఎన్నిక పేరిట ప్రజల మధ్య వైవిధ్యాలు సృష్టిస్తుందని దళితులు గిరిజనులు అట్టడుగు శ్రామికుల పై దాడులు హత్యలు అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయని వారన్నారు. 8 సంవత్సరాల మోడీ పాలనలలో మహిళలపై విద్యార్థినీలపై అత్యాచారాలు పెరుగుతున్న మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. దేశంలో ఒకే భాష ఒకే జెండా ఒకే అజెండా కార్పొరేట్ జెండా అయినటువంటి కాషాయ జెండా దేశవ్యాప్తంగా ఎగరవేయాలని మోడీ ప్రభుత్వం ఇంతటి దారుణానికి తెర లేపారని విమర్శించారు నవంబర్ 25,26,27 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను ఏలూరులో విద్యార్థులు వేలాదిగా వచ్చి పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో APTF టీచర్స్ ఫెడరేషన్ నాయకులు నాగన్న దస్తగిరమ్మ పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, డివిజన్ నాయకులు రవి రమేష్,మహేంద్ర పాల్గొన్నారు.