NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘పద్మ’ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

1 min read

– కర్నూలు కలెక్టర్ జి వీరపాండియన్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : భారత ప్రభుత్వం–2022 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నామినేషన్ / బయోడేటాలు నిర్దేశించిన ప్రొఫార్మా లో ఆయా రంగాలలో చేసిన సేవలు సంబంధించిన వివరాలు పూర్తి చేసి వెంటనే ఆయా డివిజన్ ల ఆర్ డి ఓలు లేదా తహసీల్దార్ లకు అందజేయవలసిందిగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అసాధారణ ప్రతిభ కనపరిచిన వంటి వివరాలు బయోడేటా, ఫోటోలు చేసిన సేవలు సంబంధించి పూర్తి వివరాలను దరఖాస్తు తో పాటు అందచేయాలన్నారు.
అవార్డుకు… అర్హతలివే.. :
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. కళలు, సాహిత్యం, విద్య, ఆటలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి అన్ని రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు, సేవలకు ఈ అవార్డు ఇస్తారని, కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు అందజేస్తారన్నారు. ఆసక్తి, అర్హతగల వారు దరఖాస్తులను ఆయా డివిజన్ లోని ఆర్ డి ఓలు లేదా తహసీల్దార్ లకు వెంటనే అందజేయాలని కలెక్టర్ జి. వీరపాండియన్​ విజ్ఞప్తి చేశారు.

About Author