PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం…

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిశ సఖి వన్ స్టాప్ సెంటర్ (సబి) లో ఉద్యోగాలకు (కాంట్రాక్టు) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యాచారానికి గురి అయిన మహిళలకు వన్ స్టాప్ సెంటర్ (సఖి) లో ఉద్యోగాలకు 50 శాతం రిజర్వేషన్ సౌకర్యం వుందని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 28.10.2021 నుండి 03.11.2021 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, రెండవ అంతస్తు, వెలుగు ఆఫీస్ ఎదురుగ వున్నా ఐ.సి.పి.ఎస్ కార్యాలయము నందు దరఖాస్తులు సమర్పించవలెను. విద్యార్హతలు, http://kurnool.ap.gov.in// ను పరిశీలించాలన్నారు.

About Author