NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పురపాలక సంఘం పారిశుద్ధ్యం ఘన వ్యర్ధాల నిర్వహణలో ప్రతిభ చూపిన మహిళలకు స్వచ్ఛత అవార్డులు ఇవ్వడానికై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నందికొట్కూరు పురపాలక సంఘం కమిషనర్ పి.కిషోర్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వ్యక్తిగత, స్వయం సహాయక, చిన్న తరహా, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత, వ్యర్ధాల శుద్ధికరణ, చెత్త సేకరణ, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించే పద్ధతులు, చెత్తతో కళాకృతుల తయారీ, చెత్తతో సంపద తయారీ, పొడి చెత్తను వినూత్న రీతిలో వినియోగించడం, స్వచ్ఛతపై అవగాహన కల్పించడం, తడి చెత్త వినియోగంతో కంపోస్టు తయారీ మొదలగు విభాగాలలో వీటిని అందజేస్తామన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈనెల 24వ తేదీలోగా నందికొట్కూరు పురపాలక కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, ఎంపికైన వారికి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవార్డులను అందజేస్తామన్నారు.

About Author