మిషన్ వాత్సల్య క్రింద స్పాన్సర్ షిప్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం
1 min read– ఐసిడిఎస్ పిడి ధనలక్ష్మి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య క్రింద స్పాన్సర్ షిప్ కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని ఐసిడిఎస్ పిడి ధనలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…18 సంవత్సరముల లోపు రక్షణ లేదా సంరక్షణ అవసరమైన పిల్లల కుటుంబాలు పిల్లలకు ఆర్థిక లేదా ఇతరత్రా అనగా పిల్లల వైద్య, విద్య మరియు అభివృద్ధి అవసరాలను తీర్చడానికి అనుబంధ మద్దతును అందించడం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం మిషన్ వాత్సల్య క్రింద స్పాన్సర్‌షిప్ ఇది షరతులతో కూడిన సహాయం అందించడం జరుగుతుందన్నారు.ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకి నెలకు ఒక్కొకరికి రూ.4000/-లు అందించడం జరుగుతుంది. స్పాన్సర్షిప్ పొందుటకు పిల్లలకు కావలసిన అర్హతలు :-
1.తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
- పిల్లలు అనాథలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలసి జీవిస్తువున్నవారు.
- తల్లిదండ్రులు ప్రాణాపాయ/ప్రాణాంతక వ్యాధికి గురైన వారు.
- తల్లిదండ్రులు ఆర్థికంగా మరియు శారీరకంగా అసమర్థులు అయివుండి పిల్లలను చూసుకోలేని వారు.
- JJ Act,2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు అనగా, కుటుంబంతో లేని పిల్లలు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, బాల కార్మికులు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, మిస్సింగ్ మరియు ఇంటినుంచి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు లేదా వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, సహాయం మరియు పునరావాసం అవసరమయ్యే హింసకు గురైన లేదా దుర్వినియోగం చేయబడిన లేదా దోపిడీకి గురైన పిల్లలు.
- PM Cares for Children Scheme (కోవిడ్-19/కరొనా వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు)
ఉండవలసిన ఆర్థిక ప్రమాణాలు :-
a. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంవత్సర ఆధాయం రూ.72,000/-లు కి మించరాదు.
b. అర్బన్ ప్రాంతాలలో కుటుంబ సంవత్సర ఆధాయం రూ.96,000/-లు కి మించరాదు.
స్పాన్సర్షిప్ యొక్క కాల పరిమితి :-
జువెనైల్ జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేదా చిల్డ్రన్స్ కోర్ట్ లిఖితపూర్వకంగా నమోదు చేయవలసిన కారణాల ఆధారంగా స్పాన్సర్‌షిప్‌ను 18 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. స్పాన్సర్‌షిప్ మద్దతు వ్యవధి మిషన్ వాత్సల్య కాలంతో సహ-టెర్మినస్‌గా ఉంటుంది.
ఏ సమయంలోనైనా పిల్లవాడిని హాస్టలో కానీ, ఏదైనా బాలసదనంలో కానీ చేర్పించిన యెడల స్పాన్సర్‌షిప్ సహాయం నిలిపివేయబడుతుందిప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విషయంలో మినహా పాఠశాలకు వెళ్లే పిల్లవాడు పాఠశాల హాజరులో 30 రోజులకు పైగా సక్రమంగా లేరని తేలితే, స్పాన్సర్‌షిప్ సహాయం సమీక్షించబడుతుంది మరియు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంధికావున అర్హత కలిగిన పిల్లలు వున్న యెడల సంబంధిత గ్రామ/వార్డు సచివాలయ పరిధిలోని మహిళా పోలీసు వారిని .రక్షణ విభాగము సిబ్బందిని రెవెన్యూ డివిజన్ల వారిగా సంప్రదించవచ్చును.
1.రాయచోటి రెరాయచోటిడివిజన్ పి ఆర్ .సునీత రాజు, లీగల్, ప్రొఫెషన్ అధికారి 79015973482. రాజంపేట రెవెన్యూ డివిజన్ – జి. సునీత ప్రొటెక్షన్ అధికారి 7901597346 - మదనపల్లి రెవెన్యూ డివిజన్ బి. వినోద్ కుమార్, సోషల్ వర్కర్ 7013089364