PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

20 ‘అంగన్​వాడీ’, 159 ఆయాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూల్ జిల్లా పరిధి లో 16 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ని 20 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మరియు 159 అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు 10 వ తరగతి పాసై మరియు అంగన్వాడీ ఆయా పోస్టునకు 7 వ తరగతి పాసు కావలెను. వయస్సు 1.7.2021 నాటికి 21 సం. నిండి 35 సం.లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. ఖాళీల వివరాలకు సంభందిత సి. డి. పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను మరియు వారి కార్యాలయము నోటిస్ బోర్డు నందు చూసుకోగలరు. మరిన్ని విషయాలకు, పూర్తి నోటిఫికేషన్ కొరకు సంబంధిత సి. డి.పి. ఓ / ప్రాజెక్టు డైరెక్టర్, కర్నూల్ వారి కార్యాలయాలను సంప్రదించవచ్చును దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టిస్ట్రేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు 30.12.2021 నుండి 07.1.2022 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయము పనిదినాలో సమర్పించవలెను.

About Author