‘గురుకుల బాలికల’లో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
1 min read
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : జిల్లాలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలల్లో 5 వ తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన అభివృద్ధి సంస్థ జిల్లా కన్వీనర్,గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ రవీంద్రయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు గడువు ఈనెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు.కావున గిరిజన బాలికలు 5 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.అందులో భాగంగానే రాయచోటి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 5 వ తరగతిలో 80, 6 వ తరగతిలో 54, 7 వ తరగతిలో 19, 8 వ తరగతిలో 16, 9 వ తరగతిలో 2 చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. కావున అర్హత గల గిరిజన బాలికలు ఈ నెల 31 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఎంపిక విధానం లాటరీ పద్ధతి ద్వారా జరుగుతుందన్నారు.