నుకాలమ్మ జాతరకు ఎమ్మెల్యేకి ఆహ్వానం
1 min readపండుగలు, జాతరలు ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది
మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పండుగలు జాతరల ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి మరియు ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. శనివారం ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆళ్ల నాని ని నుకాలమ్మ జాతరకు ఆహ్వానించేందుకు 43,44 డివిజన్ కార్పొరేటర్లు జనపరెడ్డీ కనక రాజేశ్వరి కృష్ణ, పొలిమేర రామ్ దాస్, శ్రీ నూకాలమ్మ గుడికి కమిటీ అధ్యక్షులు నక్క నాగేశ్వరావు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను ఆళ్ల నాని ని మర్యాదపూర్వకంగా కలిసి కి ఆహ్వాన పత్రికను అందించారు. ఈసందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ పండుగలు, జాతర్లు ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడేందుకే పూర్వికులు ఇటువంటి సంప్రదాయాలు మనకు ప్రతి యేడు చేసే అలవాటు చేశారని, పండుగలు వారసత్వ సంపదగా వచ్చాయని ప్రతి ఒక్కరు అమ్మవారి జాతర కార్యక్రమం లో పాల్గొనాలన్నరు.