రోడ్ల నిర్మాణానికి ప్రజా పెట్టుబడులకు ఆహ్వానం
1 min readపల్లెవెలుగువెబ్ : రోడ్ల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించేందుకు చిన్న (రిటైల్) ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోబోదన్నారు. బదులుగా రూ.లక్ష పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న చిన్న ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించనున్నట్టు తెలిపారు. ఈ నిధులకు వార్షికంగా 8 శాతం రిటర్ను హామీ ఉంటుందన్నారు. పలు పట్టణాలు, నగరాల్లో రైల్వే క్రాసింగ్‌లు, బ్రిడ్జిలపై నుంచి రోడ్ల నిర్మాణానికి రూ.8,000 కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఏటా తమ శాఖ రూ.5 లక్షల కోట్లకు పైగా విలువైన పనులను చే పడుతోందని చెప్పారు. దేశంలోని రోడ్డు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు అమితాసక్తి చూపుతున్నారని గడ్కరీ తెలిపారు. అయితే తమ నుంచి మాత్రం ఆసక్తి లేదన్నారు.