NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ మ్యాచ్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : కరోన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ 2022 మ్యాచ్‌ల నిర్వహణను కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందులో భాగంగా వేదికలను సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అన్నీ సజావుగా సాగి భారత్‌లో కోవిడ్‌ కేసులు అదుపులోకి వస్తే ఏప్రిల్‌ 2 నుంచి జూన్‌ 3 మధ్య తేదీల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో, ప్లే ఆఫ్స్‌ను గుజరాత్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సైతం ఇదివరకే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. లీగ్‌ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్‌, పూణే స్టేడియాలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించాలన్నది బీసీసీఐ ప్రణాళికగా తెలుస్తోంది.

     

About Author