NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమాస్తుల కేసు.. సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పై విచార‌ణ‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అక్రమాస్తుల కేసులో సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ మ‌రోసారి వాయిదాప‌డింది. లిఖిత‌పూర్వక వాద‌న‌లు వినిపించేందుకు సీబీఐ మ‌రింత స‌మ‌యం కోరింది. దీంతో విచార‌ణ‌ను సీబీఐ కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ర‌ఘురామ‌కృష్ణరాజు, జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు ఇప్పటికే లిఖిత‌పూర్వక వాద‌న‌లు కోర్టకు స‌మ‌ర్పించారు. విచ‌క్షణ మేర‌కు చ‌ట్ట ప్రకారం పిటిష‌న్ లోని అంశాల‌పై నిర్ణయం తీసుకోవాల‌ని సీబీఐ గతంలో కోర్టుకు వివ‌రించింది. తాము కూడ లిఖిత‌పూర్వకంగా వాద‌న‌లు వినిపిస్తామ‌ని, ప‌ది రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని సీబీఐ ఈనెల 14న కోర్టును కోరింది. అంగీక‌రించిన కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఇవాళ కూడ సీబీఐ స‌మ‌యం కోర‌డంతో కోర్టు విచార‌ణ వాయిదా వేసింది.

About Author