ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు.. సీఐడీ దర్యాప్తు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గతంలో కాంట్రాక్టర్ కు అనుకూలంగా టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫైబర్ నెట్ ఎండీ, చైర్మన్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి నాదులాపల్లి శ్రీకాంత్ జీవో జారీ చేశారు.