ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలి..
1 min readపాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి.
పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్లు: ఏపీపీఎస్సీ లో జరిగిన అక్రమాలు నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిన అక్రమాలను ఖండిస్తూ ఓర్వకల్లు జాతీయ రహదారిపై గురువారం నాడు రాస్తారోకో,ధర్నా కార్యక్రమం చేపట్టిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ .ఈ సందర్భoగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ ఏపీపీఎస్సీలో 150 కోట్ల కుంభకోణం జరిగింది అని.సంతలో పశువులు అమ్ముకున్నట్టు జగన్ రెడ్డి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు. గ్రూప్-1మెయిన్స్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలు హైకోర్టులో బహిర్గతం, ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ 2,50 కోట్లకు,ఒక్కో డిఎస్సీ పోస్ట్ రూ 1,50 కోట్లకు 30 డిప్యూటీ కలెక్టర్ అక్రమ భర్తీ టిఎస్పిఎస్సిలో మోసాలపై చర్యలు తీసుకున్నట్టే ఏపీపీఎస్సీ మోసాలపై ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు, చైర్మన్ గౌతమ్ సవాంగ్ పై చర్యలు తీసుకోవాలి అని, ఏమాత్రం నైతిక విలువలు ఉన్న జగన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణులు,భారీ ఎత్తున పాల్గొన్నారు.