PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 రుద్రభారతిపేట అక్రమాలపై చర్యలు ఏవి!

1 min read

– అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పిన పట్టించుకోని అధికారులు

– ఓకే రేషన్ కార్డు పై మూడు నాలుగు బిల్డింగులు, స్థలాలు ఆక్రమించిన చోద్యం చూస్తున్న అధికారులు

– అక్రమార్కులు అండగా వీఆర్వో శ్రీనివాసులు

– పొట్టి పాటి రానా ప్రతాపరెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని చిన్నమాచపల్లి రెవిన్యూ పరిధిలోని రుద్ర భారతి పేటలో కొంతమంది అక్రమార్కులు చేరి బోగస్ పేర్లతో వందలాది స్థలాలు కాల్ చేయడమే కాకుండా, కోనేటి గుంతను కూడా ఆక్రమించడం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని పక్కా సమాచారంతో అధికారులకు విన్నవించడం జరిగిందని పొట్టి పాటి రానా ప్రతాపరెడ్డి పేర్కొన్నారు, బుధవారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, మండలంలోని చిన్నమాచపల్లి పరిధిలో గల రుద్రభారతి పేటలో రోజు రోజుకు అక్రమాలు పెరిగిపోతున్నాయని, అక్రమార్కులకు తాహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే వీఆర్వో శ్రీనివాసులు అండదండలు మెండుగా ఉన్నాయని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా అక్రమార్కులు ఓకే రేషన్ కార్డు పై మూడు నాలుగు పక్క ప్రభుత్వ పక్కా గృహాలు పొందడం జరిగిందన్నారు, ఒక వ్యక్తికి ఇంటి స్థలం కేటాయించాలంటే ఎన్నో విధాలుగా ఆలోచించి అతనికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తుందని, అలాంటిది ఒకే రేషన్ కార్డు పై మూడు నాలుగు స్థలాలు కేటాయించడం ఏ కాకుండా, పక్కా గృహాలు కూడా మంజూరు చేయడం జరిగిందని, దీనిపై సమగ్ర సమాచారం తీసుకొని సంబంధిత అధికారులకు అర్జీల రూపంలో సమర్పించడం జరిగిందన్నారు, దీనికి స్పందించిన కలెక్టర్ అక్రమార్కులపై చర్యలు తీసుకొని రెవెన్యూ యాక్ట్ కింద స్థలాలు, అదేవిధంగా ప్రభుత్వ పక్క గృహాలు స్వాధీనం చేసుకుని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించినప్పటికీ, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, స్వయంగా జిల్లా కలెక్టరే అటు పోలీసు అధికారులకు, ఇటు రెవెన్యూ అధికారులకు వారిపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నప్పటికీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు, ఇప్పటికీ కూడా దొంగ డీపారాలు తయారు చేయడం వారికి పరిపాటైపోయిందని ఇంత చేస్తున్న వీఆర్వో శ్రీనివాసులు అక్రమార్కులకు అండగా నిలవడం చూస్తే తాసిల్దార్ కార్యాలయం ఎలా ఉందో ఇప్పటికే అర్థమై ఉంటుందని ఆయన అన్నారు, అలాగే ఎక్కడ ఉన్న ఉద్యోగస్తుల పేరు మీద కూడా వీరు ఇక్కడ స్థలాలు తీసుకోవడమే కాకుండా వారి పేరు మీద ప్రభుత్వ పక్కా గృహాలు కూడా నిర్మించుకోవడం జరిగిందన్నారు, పేరు ఒకటి ఫోటో ఒకటి ఉంటుందని, బ్యాంక్ ఖాతాలో లో ఒక పేరు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులలో ఇంకో పేరు ఉంటుందని ఇలా ఎలా పడితే అలా వారి మోసాలకు హద్దే లేకుండా పోయిందని, తాసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే ఈ కార్యాలయంలో రుద్ర భారతీపేటకు సంబంధించి రికార్డులు లేవని ఒకసారి , ఇక్కడ అక్రమాలు జరగలేదని మరోసారి అధికారులు సమాచారం ఇస్తున్నారంటే దీనిని బట్టి అక్కడ ఎంత అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు, ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని అక్రమార్కులపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేయవలసిందిగా కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

About Author