కలెక్టర్ ను కలిసిన ఇరిగేషన్ సి.ఈ.
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ( సి.ఈ) కబీర్ బాష మంగళవారం కలెక్టర్ పి. రంజిత్ బాషను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరిగేషన్ ఇన్చార్జ్ సి.ఈ.గా ఉన్న కబీర్ బాష కు రెగ్యులర్ సి.ఈ.గా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ లో కలెక్టర్ పి. రంజిత్ బాషను కలిసిన సి..ఈ.కబీర్ బాష … ఉన్నతాధికారులు ఇచ్చిన పనులను మరింత బాధ్యతగా చేస్తానని తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సి.ఈ. కబీర్ బాష వెల్లడించారు.