సాగునీరు పంచాయతీ తూము మూసివేయడంతో అన్నదాతల ఆందోళన..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండలంలో ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలకు వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతన్నలు వేసిన పంటలకు నీరందక ఎండిపోతున్న తరుణంలో బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుండి అలగనూరు రిజర్వాయర్ కు నీటిని మళ్లించి అలగనూరు రిజర్వాయర్ ద్వారా గడివేముల మండలంలోని రైతన్నల పంట పొలాలకు నీరు అందించే దిశగా నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయగా అందుకు విరుద్ధంగా అలగనూరు రిజర్వాయర్ తూము వద్దకు నీరు రాకుండా డిఈ మోహన్ రావు గారు తూము వద్దకు నీరు రాకుండా అడ్డంగా మట్టి కట్టను వేసి నీటిని నిలుపుదల చేయాలని చెప్పారంటూ లస్కర్లు తూము వద్దకు నీరు చేరకుండా మట్టి కట్టను ఏర్పాటు చేశారు.విషయం తెలుసుకున్న గడివేముల మండలంలోని రైతు సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తు తీసుకుని వెళ్లి తూము నీటిని ఆపు చేసిన మట్టికట్టను జెసిబి తో తొలగించి తూము వద్దకు నీటి సరఫరా సాగేందుకు వీలుగా విధంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గడివేముల రైతు సోదరులు పాల్గొన్నారు.