పందికోన రిజర్వాయర్ కింద 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పందికోన రిజర్వాయర్ కింద ఉన్న ఎడమ కాలును ముందుకు పొడిగించి 30 వేల ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందివ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంపుకు జరుగుతున్న పనులను పరిశీలించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం హంద్రీనీవా కాలువ మీదుగా పర్యటించారు. ఈ సందర్భంగా పత్తికొండ సిపిఐ బృందం మంత్రిని కలుసుకొని పత్తికొండ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు అందరినీ రిజర్వాయర్ ద్వారా సాగునీరు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి రాజా సాహెబ్, ఏం నబి రసూల్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు గురుదాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య తదితరులు మంత్రిని కలుసుకొని పరిస్థితిని వివరించారు. పత్తికొండ మండలం పందికోన రిజర్వాయరు కింద ఉన్న ఎడమ కాలువను హోసూరు, పెద్దహుల్తి, చిన్నహుల్తి, జూటూరు, నలకదొడ్డి, అటికెలగుండు,బిల్లేకల్లు కైరుప్పల గ్రామాల మీదుగా వెంగలాయదొడ్డి చెరువు వరకు పొడిగించి అదనంగా 30, వేల ఎకరాలకు సాగునీరు గ్రామాలకు త్రాగునీరు అందించాలని వారు మంత్రిని కోరారు.కర్నూలు జిల్లా పడమటి ప్రాంతం ఆయన పత్తికొండ నియోజకవర్గం గత అనేక సంవత్సరాల నుండి కరువు గురై రైతులు పంటలు పండగ తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు.అయితే ఆ సందర్భంలోనే కృష్ణాజలాలు రాయలసీమకు మరియు పత్తికొండ కు మల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తికొండ ప్రాంతంలో పంట భూములకు నీళ్లు ఇవ్వాలని గ్రామ గ్రామాన రైతులను చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరారు.