PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా..? 

1 min read

టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి.

చంద్రబాబు అరెస్టు కు నిరసనగా టీడీపీ రిలే నిరాహారదీక్షలు.

సైకో జగన్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడు వినాయక.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాజకీయ దురుద్దేశంతోనే తెదేపా అధినేత చంద్రబాబును జైలుకు పంపారని టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నందికొట్కూరు పట్టణం ధర్నా చౌక్ లో  బుధవారం  టీడీపీ  ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక  రిలే నిరాహారదీక్షలో శివానంద రెడ్డి పాల్గొన్నారు. వినాయక చవితి సంధర్భంగా  విఘ్నులు తొలగి కడిగిన ముత్యంలా  చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాండ్ర శివానంద రెడ్డి మాట్లాడుతూ  ఎన్నికల్లో లబ్ధికోసమే జగన్ ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను జైల్లో పెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? లక్షలాదిమంది యువతకు నైపుణ్యం మెరుగు పర్చేలా కృషి చేశారు. అభివృద్ధి, సంక్షేమం చేయడం నేరమా? ఉద్యోగాలు కల్పించడం నేరమా? ఇప్పుడున్న ప్రభుత్వం గంజాయి, లిక్కర్‌ ఇచ్చి యువత జీవితాలనునాశనం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీ అస్తవ్యస్తంగా మారిందిని వినియోగదారులు అడిగిన దాన్ని కాకుండా ప్రభుత్వం సరఫరా చేసిన దాన్నే తాగాల్సి వస్తోందని టీడీపీ నాయకులు శివానంద రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇష్టమొచ్చిన బ్రాండ్లను ప్రజలపై రుద్దుతోందని దీంతో వారు చేసేది లేక దొరికింది తాగుతున్నారన్నారు. మద్యం పాలసీని సక్రమంగా అమలు చేయకుండా పనికి రాని బ్రాండ్లు వినియోగంలోకి తెస్తోందని  ఫలితంగా మందుబాబులు మృత్యువాత పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. జాతీయ నేతలు కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తున్నారని న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని , చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని  తెలిపారు. కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి ,ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య,  , మండల కన్వీనర్లు, పలుచాని మహేష్ రెడ్డి,    మైనార్టీ నాయకులు జాకీర్ ,ఐ టీడీపీ నాయకులు మూర్తుజావలి ,మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి, బీసీ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ పట్టణ కార్యదర్శి బొల్లెద్దుల చిన్న రాజన్న, సిరిగిరి  కళాకర్, చెరుకుచెర్ల మాణిక్య రాజు,   పాలమర్రి నాగరాజు, సోమ శేఖర్, నరసింహా రెడ్డి ,తిమ్మారెడ్డివెంకటేశ్వరరెడ్డి, నారపురెడ్డి, రైతు నాయకులు గోవిందు, రాముడు, రవీంద్ర రెడ్డి, నాగరాజు, ఖాళీల్ బేగ్, మొల్ల బేగ్, జయాకర్, అనిల్, లాడెన్, కృష్ణ , బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

About Author