PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రిప్టోల‌ను నిషేధించ‌డమా.. నియంత్రించ‌డ‌మా ?

1 min read
                             

ప‌ల్లెవెలుగువెబ్ : అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టో క‌రెన్సీని నిషేధిస్తే ఉప‌యోగంలేద‌ని, వాటిని నియంత్రిస్తేనే ఉప‌యోగ‌మ‌ని ఐఎంఎఫ్ చీఫ్ ఎక‌న‌మిస్ట్ గీతాగోపీనాథ్ అభిప్రాయ‌ప‌డ్డారు. క్రిప్టో క‌రెన్సీకి డిమాండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో వాటికి అంత‌ర్జాతీయ విధానం తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ఏ ఒక్క‌దేశం నిషేధించినా ఇంకో దేశంలో వాటికి సంబంధించిన ట్రేడింగ్ జ‌రుగుతుంద‌ని, క్రిప్టోను నిషేధం ఒక్క‌దేశం వ‌ల్ల జ‌రిగే ప‌నికాద‌న్నారు. భార‌త్ లో క్రిప్టో క‌రెన్సీ నిషేధిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో గీతాగోపీనాథ్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

 

About Author