PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోట్లకి బుగ్గన పోటీనా ….

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: డోన్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కి  బుగ్గన రాజేంద్రనాథ్ పోటినా  తెదేపాను గెలిచి చూపిస్తానని బుగ్గన ని ఇంటికి సాగనంపుతానని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈసందర్భంగా సోమవారం  తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గం అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించిన తర్వాత  మొట్టమొదటిగా ప్యాపిలి పట్టణానికి  పర్యటించారు. ఆయన రాకతో తెదేపా, జనసేన, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలుకుతూ ఆయనకు పూలమాలలతో ముంచెత్తారు. అనంతరం ఆయన తెదేపా కార్యాలయం చేరుకొని ఆయన పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. కార్యాలయంలో  కొద్ది సమయం కేటాయించి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం అనంతరం వెహికల్ పై రోడ్ షో ఆయన ఆర్టీసీ బస్టాండ్ వరకు చేస్తూ ఆయన మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం అంటే కోట్ల, కెయి ల అడ్డాని ఆయన అన్నారు. పిట్ట కథల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ని నమ్మద్దండిని, అప్పుల మంత్రి ని కూడా ఎద్దేవా చేశారు. మేము వేసిన రోడ్లపై తమలపాకు తారు ఏసి తా రోడ్లు వేసినామని సృష్టిస్తున్నాడని ఆయన తెలిపారు. అభివృద్ధి అంటే కోట్లకి వాళ్లే అని ఎవరు లేరని ఆయన అన్నారు. గెలిచేది తెలుగుదేశమే అని వైసీపీని  ఇంటికి సాగనంపుతామని డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధితో ముందుకు నడిపిద్దామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట్ల రాఘవేంద్ర రెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్, మాజీ ఎంపీపీ టి. శ్రీనివాసులు, నాయకులు  ఆర్ ఇ. నాగరాజు, గొల్ల రామ్మోహన్ యాదవ్,నడిగడ్డ నాగేంద్ర, రామేశ్వర్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా పీర్, గుడిపాడు వెంకట్ రెడ్డి, చల్ల వీర, చల్ల అనుదీప్, టి. వెంకటేష్, కృష్ణమోహన్, అలీబాద్ పరమేష్, గండికోట రామసుబ్బయ్య, రంపురం నాగేశ్వరరావు, టైలర్ రమేష్, వెంకటేష్, సుధాకర్, బాలకృష్ణ, శేగు భాష ,మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author