NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ్యాగీ నూడిల్స్, కిట్ క్యాట్ చాక్లెట్ తింటే ప్రమాద‌క‌ర‌మా..?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఉత్పత్తుల కంపెనీల్లో నెస్లే ఒక‌టి. నెస్లే ప్రాడెక్టుల‌కు మంచి డిమాండ్ ఉంది. మ్యాగీ నూడ‌ల్స్, కిట్ క్యాట్ చాక్లెట్ అంటే పిల్లల‌కు మ‌హా ఇష్టం. అలాంటి నెస్లే కంపెనీ త‌యారు చేసే ప్రాడ‌క్టులు 60 శాతం హానిక‌ర‌మైన‌వ‌ని, ఆ కంపెనీ అంత‌ర్గత నివేదిక ద్వార ఈవిష‌యం తెలిసిన‌ట్టు ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ప‌త్రిక వెల్లడించింది. ఉత్పత్తుల్లో త‌యారీలో ఎలాంటి మార్పులు చేసినా నాణ్యత‌తో కూడిన ఉత్పత్తులు రావ‌డంలేద‌ట అని ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ప‌త్రిక తెలిపింది. భ‌విష్యత్తుల్లో నాణ్యమైన ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాలు రూపొందిస్తామ‌ని నెస్లే కంపెనీ ప్రక‌టించిన‌ట్టు ఫైనాన్షియ‌ల్ టైమ్స్ పేర్కొంది.

About Author