నాన్ స్టిక్ పాత్రలతో ప్రమాదమా.. పరిశోధకులు ఏం చెబుతున్నారు ?
1 min readపల్లెవెలుగువెబ్ : మానవ జీవనంలో నాన్ స్టిక్ పాత్రల వినియోగం పెరిగింది. వీటిల్లో వండితే పదార్థాలు అంటుకోకుండా, శుభ్రం చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. పైగా దోశల వంటివి నాన్ స్టిక్ పెనాలపై మంచి అందంగా వస్తుంటాయి. కనుక చాలా మంది వీటికి అలవాటు పడ్డారు. కానీ, వీటి వాడకం వల్ల ఉన్న హెల్త్ రిస్క్ లపై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్లైండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్ కు చెందిన పరిశోధకులు నాన్ స్టిక్ పాత్రల వాడకంపై ఓ పరిశోధన నిర్వహించగా, దీని ఫలితాలు సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్ మెంట్ లో ప్రచురితమయ్యాయి. నాన్ స్టిక్ అంటే అంటుకోనిది అని అర్థం. టెఫ్లాన్ అనే కెమికల్ కోటింగ్ వల్ల ఈ నాన్ స్టిక్ గుణం వస్తుంది. ఈ పాత్రలను వాడుకుంటూ, వాటిని శుభ్రం చేస్తున్న క్రమంలో కొంత కాలానికి ఈ కోటింగ్ కొద్ది కొద్దిగా పోతుండడం గమనించే ఉంటారు. ఇలా తొలగిపోయే టెఫ్లాన్ కోటింగ్ రూపంలో 9,100 కెమికల్ పార్టికల్స్ మన ఆహారంలోకి చేరుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.