ఎల్ఐసీ ఐపీవో వాయిదా పడే అవకాశం ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఎల్ఐసీ ఐపీవో వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఎల్‌ఐసీ ఐపీఓపై ముందుకు వెళ్లాలనే ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలు అనుకూలించకపోతే, ఐపీఓపై సమీక్షకూ వెనకాడం
అని అన్నారు. దీన్నిబట్టి ఎల్‌ఐసీ ఐపీఓపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి ఈ నెల 11న ఎల్‌ఐసీ ఐపీఓ ఉండొచ్చని మర్చంట్ బ్యాంకులు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.