NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నితిన్‌తో నిజమేనా?

1 min read

సినిమా డెస్క్​: వరుస అవకాశాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తూ అప్పుడప్పుడూ బాలీవుడ్ లోనూ మెరుస్తోంది పూజాహెగ్డే. తాజాగా తన బ్యాగ్‌లో మరో తెలుగు సినిమా చేరబోతోందిట. నితిన్ కి జంటగా పూజ నటించనుందని టాక్. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రం షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు నితిన్‌. వక్కంతం వంశీ దర్శకత్వంలో త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్డేని తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే అఫీషియల్ కన్ఫమేషన్‌ రావాల్సి ఉంది. లవ్ స్టోరీస్ తగ్గించిన నితిన్‌ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. అలా చూస్తే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ పాత్రకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే అవకాశం ఉంది. తను అఖిల్ కి జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ కి రెడీగా ఉంది. రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కి జంటగా తమిళ చిత్రం ‘బీస్ట్’ షూటింగ్ లో పాల్గొంటున్న పూజ, సర్కస్, భాయిజాన్ బాలీవుడ్ మూవీస్‌లో కూడా నటిస్తోంది.

About Author