మందు మంచిదేనా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆల్కాహాల్ తీసుకోవటం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని వైద్యులు చెబుతుంటారు. అయితే.. మద్యం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉన్నాయని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ‍్యయనం తేల్చింది. అవునండి అది నిజమేనటా? లిక్కర్ తాగితే చాలా రోగాలు దరిచేరవటా! కానీ, దానికో షరతు ఉంది. మీరు 40 ఏళ్ల వయసు దాటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే.. చిన్న గ్లాస్ రెడ్ వైన్, బీరు బాటిల్, విష్కి లేదా ఇతర లిక్కర్‌ను ప్రామాణిక మోతాదులో తీసుకోవచ్చని తేల్చింది. దాంతో గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, గుండపోటు, మధుమేహం వంటివి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది.