విమానం టికెట్ ధర ఇంత తక్కువా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో సంస్థ ప్రయాణం మొదలై 16 ఏళ్లు పూర్తి కావడంతో ‘స్వీట్ 16’ పేరుతో విమాన టికెట్ ధరలపై ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా విమాన టికెట్ ధర రూ.1,616 నుంచి మొదలవుతుందని ఇండిగో పేర్కొంది.