NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని నమస్తే తెలంగాణ పత్రికలో ఒక కథనం వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ఇది వెల్లడయిందని తెలిపింది. తెలంగాణ మాదిరే మరో మూడు రాష్ట్రాల్లో ఇదే తరహా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది. ఏపీ సీఎం జగన్ తో మోదీ స్నేహపూర్వకంగా ఉంటూనే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టారని తెలిపింది. సిట్ దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసిందని వెల్లడించింది. వైసీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని… వీరిలో 55 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే లాబీయిస్టులకు టచ్ లోకి వెళ్లారని పేర్కొంది. జగన్ ను ఆప్యాయంగా కౌగిలించుకుంటూనే… ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితులు సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం ఉందని తెలిపింది.

About Author